షాకింగ్ : నటుడు నాజర్ కు గాయాలు

Published on Aug 17, 2022 7:30 pm IST

టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో అనేక పాత్రలు చేసి ఆడియన్స్ నుండి బాగా పేరు గడించిన నటుడు నాజర్. అలానే తెలుగు, తమిళ్ తో పాటు పలు ఇతర భాషల్లో సైతం ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా పలు సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్న నాజర్ నేడు ప్రమాదవశాత్తు జారిపడి గాయాల పాలయ్యారు.

నేడు ఒక తమిళ సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో దాని షూట్ జరుగుతున్న సమయంలో ఆయన మెట్లు దిగుతుండగా ఒక్కసారిగా కాలుజారి పడడంతో వెంటనే ఆయనని సమీప ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించింది యూనిట్. అయితే ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ లేదని, అది మైనర్ ఇంజురీ మాత్రమే అని డాక్టర్లు వెల్లడించారట. కొద్దిరోజుల రెస్ట్ అనంతరం నాజర్ మళ్ళి షూటింగ్ లో యధావిధిగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ లో నటి సుహాసిని, హీరోయిన్ మెహ్రీన్, షాయాజి షిండే కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

సంబంధిత సమాచారం :