ఒకప్పటి విలన్ పరిస్థితి ఎంత దయనీయం..!


ఫైటర్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పొన్నంబళమ్ విలన్ గా అనేక సినిమాలలో నటించి మెప్పించారు. తెలుగులో కూడా ఆయన చిరంజీవి, బాలకృష్ణ మరియి అనేక మంది హీరోల సినిమాలలో విలన్ గా నటించడం జరిగింది. 90లలో విలన్ గా పొన్నాంబళం బాగా ఫేమస్. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమి బాగోలేదు. కిడ్సీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొన్నాంబళం చికిత్సకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నారట.

ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ అతడికి ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడి పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కాగా కమల్, పొన్నంబళమ్ అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, భారతీయుడు వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ తో కలిసి ముత్తు, అరుణాచలం చిత్రాల్లోనూ పొన్నాంబళం నటించడం జరిగింది. చిరంజీవి హిట్లర్ మూవీలో పొన్నాంబళం విలన్ గా నటించారు.

Exit mobile version