లేటెస్ట్..నటుడు ప్రభు కి అస్వస్థత.!

Published on Feb 22, 2023 8:00 am IST

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు ప్రముఖ నటుల్లో అయితే తమిళ స్టార్ నటుడు ప్రభు కూడా ఒకరు. తమిళ్ సహా తెలుగులో కూడా అయన అనేక సినిమాల్లో నటించి సుపరిచితులు అయ్యారు. అయితే ఈ నటుడు ఇటీవల అనారోగ్యంకి గురైనట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ప్రభు అయితే తీవ్ర కడుపునొప్పి తో అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారట.

మరి ఆయనకి లేజర్ ఎండోస్కోపీ సర్జరీ కూడా జరిగింది అని ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభు సర్జరీ కంప్లీట్ చేసుకున్నారని అలాగే ఇప్పుడు తన హెల్త్ కూడా నిలకడగా ఉన్నట్టుగా లేటెస్ట్ సమాచారం. అలాగే మరో రెండు మూడు రోజుల్లో అయితే తాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారట. మరి లేటెస్ట్ గా అయితే ప్రభు విజయ్ వారిసు సహా పలు తమిళ సినిమాల్లో కనిపించారు.

సంబంధిత సమాచారం :