జిమ్ లో మెగాస్టార్ తో ప్రకాష్ రాజ్..ఎగ్జైట్మెంట్ పోస్ట్!

Published on Aug 17, 2021 11:55 am IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం “ఆచార్య” దీనిని ఇటీవలే తన టాకీ పార్ట్ వరకు పూర్తి చేసేసి తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా చేసేసారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్ తన లుక్ ని మరింత ఫిట్ గా రెడీ చేసే పనిలో పడ్డారు. అయితే అందులో భాగంగానే తాను జిమ్ లో కసరత్తులు చేస్తుండగా తాను కలుసుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ కలయికపై ఎగ్జైట్ అవుతూ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు.

సినీ ఇండస్ట్రీలో పలు సమస్యలపై పరిష్కారం చూపించినందుకు ధన్యవాదాలు తెలిపి తాను ఎప్పుడు ప్రేరణ కలిగించే ‘అన్నయ్యే’ అని తెలిపారు. అలాగే మెగాస్టార్ మనకి ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని తెలిపారు. మరి మెగాస్టార్ తో పాటుగా ప్రకాష్ రాజ్ కూడా పలు చిత్రాల్లో బిజీగా ఉండగా రానున్న “మా” ఎన్నికల్లో కూడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :