పవన్ సినిమాపై 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్.!

Published on Feb 27, 2022 7:31 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” ఇప్పుడు మాస్ జాతర కొనసాగిస్తోంది. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి మన్ననలు అందుకుంటుండగా ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు కూడా కీలక కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. తాను రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను భీమ్లా నాయక్ చిత్రాన్ని తాడేపల్లి గూడెం లో చూశానని.

అయితే అప్పుడెప్పుడో రామారావు గారు నటించిన అడవి రాముడు సినిమాకి భారీ స్థాయిలో వచ్చిన జనాన్ని మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకే చూశానని పవన్ పెద్ద సక్సెస్ అందుకున్నందుకు అతని అభిమానులకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. అలాగే ఇలాంటి సినిమాలో తాను భాగం కానందుకు చాలా బాధగా ఉంది అని ఈ సినిమాతో పవన్ కి దిష్టి తగిలి ఉంటుంది అని ఆసక్తికర కామెంట్స్ ని తాను చేయడం ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :