బుల్లితెరపై ‘బలగం’ ని ఇంతగా ఆదరించినందుకు కృతజ్ఞతలు – ప్రియదర్శి

Published on May 18, 2023 11:40 pm IST

వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఫామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి కలిసి భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అలానే అటు ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులని సైతం కొల్లగొట్టింది. అలానే ఓటిటి లో సైతం ఆడియన్స్ ని ఎంతో మెప్పించి మంచి వ్యూస్ సొంతం చేసుకుంది బలగం.

అయితే విషయం ఏమిటంటే, తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా టివిలో ప్రదర్శితం అయిన బలగం మూవీ ఏకంగా 14.3 టిఆర్పి అందుకోవడం విశేషం. అలానే అటు హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈ మూవీకి 22 టిఆర్పి లభించింది. దానితో యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుండగా, కొద్దిసేపటి క్రితం ఈ మూవీలో హీరోగా నటించిన ప్రియదర్శి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులు తమ సినిమాని ఇంతగా ఆదరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :