“11:11” మూవీ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన రానా!

“11:11” మూవీ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన రానా!

Published on Jan 26, 2022 3:00 PM IST


కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌ గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 11:11. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాల పై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో హీరో దగ్గుబాటి రానా 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్ సాలూర్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.

గతంలో ఈ 11:11 చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌ లో గ్రాండ్‌గా లాంచ్ చేసి చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ విషయంలో రానా సపోర్ట్ దొరికింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని రానా కోరుకున్నారు.

రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్, రోహిత్, కోటి సాలూర్, సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ రవి మాన్ల, డైలాగ్స్ పవన్ కె అచల, మ్యూజిక్ మణిశర్మ, ప్రొడ్యూసర్ గాజుల వీరేష్, లైన్ ప్రొడ్యూసర్ సందీప్ గాలి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కిట్టు నల్లూరి, పీఆర్వో సాయి సతీష్, రాంబాబు పర్వతనేని లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు