బాగా నచ్చటంతో సమర్పించాలని ఫిక్స్‌ అయ్యా – రవితేజ

Published on Feb 7, 2022 12:53 am IST


తమిళ నటుడు విష్ణువిశాల్‌ హీరోగా మను ఆనంద్‌ తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్‌ఐఆర్‌’. మంజిమా మోహన్‌ కథానాయికగా నటించింది. విష్ణువిశాల్‌ నిర్మించిన ఈ సినిమాని రవితేజ సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ లో రవితేజ మాట్లాడుతూ.. “ఈ సినిమాను ఆరు నెలల క్రితమే చూశా. బాగా నచ్చటంతో ఈ చిత్రాన్ని సమర్పించాలని ఫిక్స్‌ అయ్యా. ఇలాంటి సినిమాలో నాకూ నటించాలనుంది. తెలుగులోనూ ఈ సినిమా విజయంవంతమై విష్ణు విశాల్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని రవితేజ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :