సచిన్ జోషికి బెయిల్ మంజూరు

Published on Mar 9, 2022 12:30 am IST


నటుడు సచిన్ జోషి తెలుగులో చాలా సినిమాలు చేసి అందరికి సుపరిచితుడు అని చెప్పాలి. అతను చాలా పవర్ ఫుల్ వ్యాపారవేత్త, కొంతకాలం క్రితం గుట్కా వ్యాపారాన్ని నడిపేవాడు. అతనిపై కొన్ని కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి మరియు మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2021 నుండి జైలులో ఉంటున్నాడు సచిన్‌.

సచిన్ కు చివరకు బెయిల్ మంజూరు చేయబడింది అని తెలుస్తోంది. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి రూ. 30 లక్షల వ్యక్తిగత బాండ్ మరియు అంత మొత్తానికి ఇద్దరు పూచీకత్తుపై అనుమతించారు. ఇతర బెయిల్ షరతులతో పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతదేశం విడిచి వెళ్లవద్దని కోర్టు కోరింది. సచిన్ జోషి కి బెయిల్ రావడం పట్ల అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :