సుకుమార్ సర్ కి హ్యాట్సాఫ్…పుష్ప చిత్రం పై సత్యదేవ్ కీలక వ్యాఖ్యలు!

Published on Jan 11, 2022 9:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా నిర్మించిన ఈ చిత్రం కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సోషల్ మీడియా వేదిక గా పుష్ప చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రాల లిస్ట్ లో పుష్ప ఉంటుంది అని తెలిపారు. ఈ ఆలోచన చేసినందుకు గానూ, సుకుమార్ సర్ కి హ్యాట్సాఫ్ అంటూ చెప్పుకొచ్చారు. పుష్పరాజ్ లాగా మాట్లాడటం, నడవడం, నటించడం, ఊపిరి పీల్చుకోవడం చూసి ఆశ్చర్య పోయాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక కేశవ పాత్రలో నటించిన బ్రదర్ జగ్గు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వల్లీ గా రశ్మిక మందన్న, కొండారెడ్డి గా అజయ్ ఘోష్ లు అద్బుతం గా నటించారు అంటూ తెలిపారు. సత్యదేవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :