“గాడ్ ఫాథర్”…సత్యదేవ్ నటనకు మంచి ప్రశంసలు..!

Published on Oct 6, 2022 7:03 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యినటువంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా కాంబోలో తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాథర్ కూడా ఒకటి. మరి మొదటి షో తోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రంలో చిరు తో పాటు అనేకమంది స్టార్స్ కూడా నటించారు. ఆల్ మోస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ చిత్రంలో నటుడు సత్యదేవ్ మాత్రం తనదైన ముద్ర వేశాడని చెప్పాలి. సినిమాలో తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఆడియెన్స్ ని అయితే ఆశ్చర్య పరిచాడు.

ముఖ్యంగా మెగాస్టార్ లాంటి నటుడుకి ఎదురుగా విలన్ లా నటించి మెప్పించడం అనేది చాలా పెద్ద విషయం అలాంటిది ఈ చిత్రంలో సత్య దేవ్ నెవర్ బెఫోర్ రోల్ లో అందులోనూ అదిరే నటనతో కనిపించాడు. దీనితో మరోసారి తన వెర్సటాలిటీ గాడ్ ఫాథర్ లో తన పాత్రకి గాను ఆడియెన్స్ నుంచి అయితే మంచి ఆదరణను ఇప్పుడు తాను అందుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :