“స్కై ల్యాబ్” సరికొత్త ప్రమోషన్స్…మరో రెండు రోజుల్లో!

Published on Dec 2, 2021 1:00 pm IST

సత్యదేవ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖందేరావు దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం స్కై ల్యాబ్. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. డిసెంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. డాక్టర్ రవి కిరణ్ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ పిన్నమరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి నిత్యా మీనన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకా ఈ చిత్రం విడుదల కి రెండు రోజుల సమయం ఉండటం తో చిత్ర యూనిట్ సరికొత్త వీడియో ను విడుదల చేయడం జరిగింది. హాలీవుడ్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పే తెలుగు సినిమాలకు మాదిరి ఒక వీడియో ను ప్రమోట్ చేయడం జరిగింది. అబ్బుర పరిచే దృశ్యాలతో, కనీవినీ ఎరుగని హస్యాలతో మీ ముందుకు వచ్చేస్తుంది స్కై ల్యాబ్, డిసెంబర్ 4 న మీ అభిమాన థియేటర్ల లో అంటూ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :