నటుడు సత్యరాజ్ ఆరోగ్యం పై అప్డేట్!

Published on Jan 10, 2022 2:25 pm IST


ప్రముఖ నటుడు సత్యరాజ్ ఆరోగ్యం పై ఆందోళన నెలకొంది. బాహుబలి సిరీస్ చిత్రాల్లో కీలక పాత్ర కట్టప్ప పాత్రను పోషించిన సత్యరాజ్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. చెన్నై లోని ఒక ఆసుపత్రి లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్యం పై ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. వైద్య బృందం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. వాడే మందులను సైతం పెంచడం జరిగింది. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :