నాగ శౌర్య నా ఇన్స్పిరేషన్…లక్ష్య ప్రీ రిలీజ్ వేడుక లో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు

Published on Dec 5, 2021 11:59 pm IST


నాగ శౌర్య హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను చిత్ర యూనిట్ నేడు నిర్వహించడం జరిగింది. ఈ వేడుక కి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శర్వానంద్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ముందుగా, జై బాలయ్య. అఖండ చిత్రం తో మళ్ళీ పూర్వ వైభవం తీసుకు వచ్చారు. ప్రేక్షకులకు థాంక్స్. పుల్లెల గోపీచంద్ గారితో స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను. చిత్ర యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలిపారు. రావడానికి ముఖ్య కారణం, నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ చాలా క్లోజ్ అంటూ చెప్పుకొచ్చారు.లవ్ స్టోరీ తో పెద్ద హిట్ ఇచ్చారు, అదే విధంగా నాగ శౌర్య కి కూడా పెద్ద హిట్ ఇస్తున్నారు.

ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. మజిలీ, జెర్సీ ఇలా చాలా సినిమాలు స్పోర్ట్స్ డ్రామా గా వచ్చి హిట్ అయ్యాయి. స్పోర్ట్స్ ఆధారం గా తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా లో నటించాలి అంటే ఒక నటుడు కి డెడికేషన్ చాలా ముఖ్యం. నాగ శౌర్య నాకు చాలా మంచి స్నేహితుడు, సోదరుడు. అదే విధంగా నాగ శౌర్య బాడీ ట్రాన్స్ ఫామ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నాగ శౌర్య నా ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చారు. నాగ శౌర్య ఒక జెన్యూన్ పర్సన్, తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. మా బాస్ చిరంజీవి చెప్పినట్లు సూపర్ స్టార్ అవుతాడు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :