ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న హార్డ్ హిట్టింగ్ డ్రామా ‘దండోరా’

Dhandoraa

ఇటీవల మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం “దండోరా” (Dhandoraa) కూడా ఒకటి. నటుడు శివాజీ, నందు అలాగే నవదీప్ తదితరులు సాలిడ్ పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మురళికాంత్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

అలాగే ఆడియెన్స్ ఇంకా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేసుకుంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ జనవరి 14 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ హార్డ్ హిట్టింగ్ కాస్ట్ డ్రామా ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కానున్నట్టు ప్రైమ్ వీడియో వారు కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు ఈ సినిమాని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడొచ్చు.

Exit mobile version