సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ ప్రభుత్వంకి తన మద్దతు తెలిపిన హీరో సిద్ధార్థ్!

సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ ప్రభుత్వంకి తన మద్దతు తెలిపిన హీరో సిద్ధార్థ్!

Published on Jul 9, 2024 1:00 AM IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. ఈ చిత్రం జూలై 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చర్చాంశనీయంగా మారింది.

అయితే ఈ మేరకు ఒక వీడియో ద్వారా బాధపడిన వారికి క్షమాపణలు తెలిపారు. భారతీయుడు 2 చిత్రంలో జీరో టోలరెన్స్ గురించి తాను మాట్లాడినట్లు తెలిపారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ మరియు అవినీతికి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ అని అన్నారు. ప్రెస్ మీట్ లో తాను ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని అన్నారు. అందుకు నేనే దాన్ని వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వంకి తన మద్దతు తెలిపారు. డ్రగ్స్ పై చేస్తున్న పోరాటంలో తన పూర్తి మద్దతు అని పేర్కొన్నారు. మన పిల్లల భవిష్యత్ వాళ్ళ చేతుల్లోనే కాకుండా, మన చేతుల్లో కూడా ఉంది. ఫ్యూచర్ ను కాపాడుకోవడం మన కర్తవ్యం. సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందరూ సపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జే. సూర్య లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు