“రాజ రాజ చోర” మీకోసం ఎదురుచూస్తూ ఉంటాడు – శ్రీ విష్ణు

Published on Aug 17, 2021 5:01 pm IST

హసిత్ గోలి దర్శకత్వం లో శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన లు హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదల కి దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. అంతేకాక తాజా గా హీరో శ్రీ విష్ణు, టాలీవుడ్ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ను కలవడం జరిగింది.

తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్ 19 న ఆశీర్వదించే ముందు మన వెంకటేష్ గారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. కచ్చితంగా మీ కుటుంబం తో కలిసి వస్తారని మా రాజ రాజ చోర ఆగస్ట్ 19 నుండి ఎదురు చూస్తూ ఉంటాడు అని పేర్కొనడం జరిగింది. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో రవిబాబు, తనికెళ్ళ భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్, కడంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :