నటుడు శ్రీకాంత్‌కు కోవిడ్-19 పాజిటివ్

నటుడు శ్రీకాంత్‌కు కోవిడ్-19 పాజిటివ్

Published on Jan 26, 2022 12:11 PM IST


ఇటీవలే అఖండ చిత్రం లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన నటుడు శ్రీకాంత్ మేకా ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డారు. నటుడు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. “ప్రియమైన స్నేహితులారా, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కోవిడ్-19 పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది అని అన్నారు. గత రెండు రోజుల నుండి కొన్ని లక్షణాలు గమనించ బడ్డాయి అంటూ చెప్పుకొచ్చారు.

తనతో పరిచయం ఉన్నవారు ఏవైనా లక్షణాలు ఉన్నాయో లేదో నిశితంగా తనిఖీ చేయడానికి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థించారు. శ్రీకాంత్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ రాబోయే చిత్రం జేమ్స్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు