ఇంటర్వ్యూ : సుధాకర్ కోమాకుల – “రాజా విక్రమార్క”లో నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది

Published on Nov 10, 2021 11:56 am IST

ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీగా ఉన్న చిత్రాల్లో కార్తికేయ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “రాజా విక్రమార్క” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల కూడా మంచి రోల్ చేసాడు. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో ఈ ఇంటర్వ్యూలో చూద్దాం.

 

చెప్పండి “రాజా విక్రమార్క” ఎలా వచ్చింది మీకు?

నాకు శ్రీ సారిపల్లి ముందు నుంచీ తెలుసు. మేము సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నుంచి మంచి పరిచయం ఉంది. మేము కూడా ఓ సినిమా చేద్దాం అనుకున్నాము. కానీ ఓరోజు సడెన్ గా ఫోన్ చేసి కార్తికేయ తో సినిమాలో ఓ రోల్ ఉంది నువ్ చెయ్యాలి అని అడిగాడు. ముందు నేను కుదరదు అనేసా ఇప్పుడు లీడ్ లో చేస్తున్నాను మళ్ళీ ఇలాంటివి వద్దు అన్నా. కానీ ఈ రోల్ నీకు బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు నాకు కూడా ఎలాగో బ్రేక్ ఉంది కాబట్టి ఈ సినిమా చేశా. సినిమాలో నా రోల్ ఇంట్రెస్టింగ్ గా సీరియస్ గా ఉంటుంది.

 

కొన్ని సినిమాల్లో ఇలాంటి రోల్స్ బాగా క్లిక్ అవుతాయి దీన్ని కూడా అలా అనుకోవచ్చా?

అవును తప్పకుండా.. నేను లాస్ట్ క్రాక్ సినిమా చేసినప్పుడు కూడా రవితేజ గారితో అని చేశా కానీ నేను కూడా అనుకోలేదు నా రోల్ కి ఇంత ఇంత రెస్పాన్స్ వస్తుంది అని. కానీ దానికన్నా ఇందులో ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా.

 

మరి మీ రోల్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

ప్రిపరేషన్ అంటే రోల్ కి తగ్గట్టుగానే బాడీ మైంటైన్ చెయ్యాలి, షార్ట్ హెయిర్ కూడా ఉండాలి. ఈ సినిమా కోసం ఇక వేరే సినిమాలు ఏవి చెయ్యకుండా ఇదే లుక్ ఉంచాను.

 

ఇంతకీ మీ రోల్ ఈ సినిమాలో పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా?

కొంచెం షేడ్స్ ఉంటాయి. రేపు సినిమా చూసాక మీకు అర్ధం అవుతుంది. సినిమాలో కీలకమైన పాత్ర అంతే అంతకు మించి చెప్పలేను.

 

నటుడుగా మీకు ఎలాంటి రోల్స్ చెయ్యడం ఇష్టం?

నాకు రియలిస్టిక్ పాత్రలు చెయ్యడం ఇష్టం అవి చేశాను కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మంచి ఎమోషనల్, కామెడీ టైప్ డ్రామాస్ ఇష్టం. ఇంకా హృదయానికి దగ్గరగా ఉండేవి, కుటుంబ సమేతంగా చూసే టైప్ సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాను.

 

ఓటిటి ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా.?

ఓటిటి నుంచి ఇంకా ఏమి అనుకోలేదు. చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంకా వాటిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బహుశా వచ్చే ఏడాది అలా స్టార్ట్ చెయ్యొచ్చు అంతే.

 

విజయ్ దేవరకొండ మీకు మంచి ఫ్రెండ్ కదా, సినిమా ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు మీరేమన్నా అడిగారా?

నేనేం అడగలేదు. ముందు మంచి సక్సెస్ అందుకొని అప్పుడు అడగొచ్చు అనుకుంటున్నాను. విజయ్ నాకు మంచి ఫ్రెండ్ ఎప్పుడు అడిగినా ఎలాంటి హెల్ప్ అయినా తాను చేస్తాడు.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో జిడి(గుండెల్లో దమ్ము) అనేది ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా ఉంటుంది. జస్ట్ ఒక రాత్రిలో నడిచేది. అలాగే నారాయణ అండ్ కో అని ఇంకోటి ఉంది. అది ఫ్యామిలీ కం కామెడీ క్రైమ్ డ్రామా. అది కూడా బాగుంది. ఇంకొకటి కంప్లీట్ కొత్త గెటప్ లో ఉంటుంది దాని కోసం తర్వాత ఎప్పుడైనా చెప్పాలి అనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం :