మహేష్ “సర్కారు వారి పాట” ను ఎంజాయ్ చేసిన సుధీర్ బాబు…ఏమన్నారంటే?

Published on May 15, 2022 6:07 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ను చూసిన యంగ్ హీరో సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

ఇప్పుడే సర్కారు వారి పాట చిత్రం ను చూసా అని అన్నారు. అన్ని విధాలుగా ఇది సూపర్ స్టార్ మహేష్ షో అని అన్నారు. ఇంక్రెడిబుల్ కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసినట్లు పోస్ట్ లో పేర్కొన్నారు. చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిడం పట్ల చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :