సుహాస్ హీరోగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on Oct 16, 2021 2:00 pm IST

‘మజిలీ’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా కూడా టర్న్ అయ్యి “కలర్ ఫోటో” తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అక్కడ నుంచి తనకి ఆఫర్స్ వస్తుండగా వాటిలో కొన్ని సెలెక్టీవ్ గా తీసుకుంటున్నాడు. మరి అలా లేటెస్ట్ గా టేకప్ చేసిన ప్రాజెక్ట్ నే “అంబాజీ పేట మ్యారేజి బ్యాండు”.

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని మేకర్స్ దసరా సందర్భంగా అనౌన్స్ చెయ్యడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని దుశ్యంత్ క‌టిక‌నేని దర్శకత్వం వహిస్తుండగా అలాగే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, మ‌హాక్రియేష‌న్స్ బ్యానర్స్ పై ధీర‌జ్ మోగిలినేని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వెంక‌టేశ్ మ‌హా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇంకా హీరోయిన్ తదితర అంశాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :