“హనుమాన్” కన్నా సూపర్ హీరో ఎవరున్నారు – తేజ సజ్జ

“హనుమాన్” కన్నా సూపర్ హీరో ఎవరున్నారు – తేజ సజ్జ

Published on Nov 21, 2022 2:30 PM IST

తేజ సజ్జ,అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్,వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో తేజ సజ్జ కీలక వ్యాఖ్యలు చేశారు.

మీడియా వారికి, తెలుగు సినీమా అభిమానులకు, సినీ అభిమానులకి, మా హనుమాన్ మీద అభిమానం తో ఇక్కడి వరకూ వచ్చిన వారందరికీ, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వారికి స్వాగతం, థాంక్స్. హను మాన్ సినిమా గురించి ఇప్పటి వరకూ డైరెక్ట్ గా ఎక్కడా మాట్లాడలేదు. హనుమాన్ గురించి చిన్న శ్లోకం చెప్పి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను.

“మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసా నమామి”

ఇంతకన్నా సూపర్ హీరో ఎవరు ఉన్నారు అండి.దీని అర్ధం గాలి కంటే వేగం గా ప్రయాణించే వారు. బుద్ధిమంతులు శ్రేష్ఠులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలను జయించినటువంటి వారు, వాయు దేవుని కుమారులు, సాక్ష్యాత్తు శ్రీ రామ చంద్ర మూర్తి దూత.ఇంతకంటే మన దగ్గర సూపర్ హీరో ఎవరున్నారు. అందరూ సూపర్ హీరోస్ అనగానే, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అని అనుకుంటారు. మనం సినిమాల్లో చూసింది వాళ్లనే. కానీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యింది మన కల్చర్ నుండి. మన హనుమంతుల వారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ ఏమో, మన సూపర్ హీరో, మన హిస్టరీ, మన కల్చర్, మన సత్యం.

మన అందరికీ ఓజి సూపర్ హీరో హనుమంతుల వారు. అంత గొప్ప దేవుడు అనుగ్రహం తో కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే, ఏం చేస్తాడు అనేది ఈ హనుమాన్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ కి థాంక్స్ చెప్తే చాలా చిన్న మాట అవుద్ది. అంతకు ముందు మేము సినిమా చేశాం, ఇది రెండో సినిమా. ప్రశాంత్ గ్రేట్ క్రాఫ్ట్ మ్యాన్, రోజూ కొత్తగా, ఎంజాయ్ చేస్తూ చేస్తాం సినిమా. కానీ ఇంటెన్షన్ మాత్రం ఒకటే. చాలా హానెస్ట్ గా, హంబుల్ గా సినిమా చేశాం. హనుమంతుల గురించి ఒక విషయం చెప్పాలి. అతను హనెస్ట్, హంబుల్ అండ్ మైటీ. ఈ చిత్రం మైటీ గా ఉండబోతోంది. మీ అందరికీ ఒక విజువల్ ఫీస్ట్ ఇస్తున్నాం అని భావిస్తున్నాం.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు