పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరో

Published on Sep 2, 2023 10:01 pm IST

మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అరుణ్ అదిత్ గా తెలుగు, తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఈయన ఆ తర్వాత 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకున్నారు. కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిగుణ్, పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డీయర్ మేఘలాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐతే, ప్రస్తుతం ఈ నటుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సెప్టెంబర్ 3న పెళ్లికి ముస్తాబు అవుతున్నాడు. నివేదిత అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు.

శనివారం సాయంత్రం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. ఆదివారం ఉదయం వెడ్డింగ్ వేడుక జరపుకుంటున్నారు. వేదిక వచ్చేసి శ్రీ సెంతుర్ మహల్, అవినాశి, తిరుపుర్, తమిళనాడులో జరగుతుంది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలా మంది సెలబ్రెటీలు హాజరు కానున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :