ఎన్టీఆర్ “నా అల్లుడు” ను రీమేక్ చేస్తా అంటున్న విశ్వక్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రం ను మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అయితే విశ్వక్ సేన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్, మీరు చాలా మంచి స్నేహితులు. ఏదైనా ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే, ఏది చేస్తారు అని అడగగా, అందుక్ విశ్వక్ సేన్ నా అల్లుడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version