ఆమని పుట్టినరోజు సందర్భంగా ‘అమ్మ‌దీవెన’ ఫస్ట్ లుక్ !

Published on Nov 17, 2019 12:00 am IST

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కెతున్న చిత్రం ‘అమ్మ‌దీవెన‌’. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆమ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 16న శ‌నివారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీ‌దేవి, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో…

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఒక మంచి శుభ సంద‌ర్భంలో పోస్ట‌ర్‌ని విడుద‌ల చెయ్య‌డం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులు చిన్న మారయ్య గుర‌వ‌య్య ప్రొడ్యూసర్స్ గా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వ‌స్తుంది. ఎటువంటి దీవెన అయినా త‌క్కువ‌వ్వొచ్చు కాని ‘అమ్మ‌దీవెన’ ఎక్క‌డా తక్కువ‌కాదు. ఈ చిత్రంలో అమ్మ పాత్ర‌లో న‌టిస్తున్న ఆమ‌నిగారికి అభినంద‌న‌లు తెలియజేస్తున్నా” అన్నారు.

ప్రముఖ నిర్మాత డి.ఎస్‌రావు మాట్లాడుతూ… తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్న. ఆమని గారు ఈ చిత్రంలో న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా పేరు వింటుంటే మాతృదేవోభ‌వ‌ సినిమా గుర్తుకువ‌స్తుంది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయి ప్రొడ్యూస‌ర్లు ఇంకా మ‌రెన్నో చిత్రాలు తియ్యాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

శ్రీ‌దేవి బొంతు మాట్లాడుతూ… ఈ రోజు నిజంగా అమ్మ‌దీవెన లాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూస‌ర్లు డైరెక్ట‌ర్ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా చాలా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవ్వాలని కోరుకుంటున్నా. అమ్మ‌గారి పేరు మీద ప్రొడ్యూస‌ర్లు ఈ సినిమా తీశారు. పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను. సిసింద్రీ నాకు ఫేవరేట్ సినిమా. ఆ సినిమాలో ఆమని గారు చాలా బాగా న‌టించారు. త‌ల్లి దీవెన‌లు ఉంటే మ‌నం ఎల్ల‌వేళ‌లా పై చేయి సాధిస్తాము” అన్నారు.

సంబంధిత సమాచారం :