ఆమెను అలా చూడలేక వెళ్లలేదు – ఆమని

Published on Feb 21, 2023 12:18 am IST

మాజీ హీరోయిన్ ఆమని కథానాయికగా మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఐతే, ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ సౌందర్య పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సౌందర్య ..తాను ఎంతో స్నేహంగా ఉండే వాళ్లం అని, ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో చేశామని, ఒకరి విషయాలను ఒకరం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అని ఆమె చెప్పుకొచ్చారు.

ఆమని ఇంకా మాట్లాడుతూ.. ‘సౌందర్య చనిపోయినప్పుడు నేను ఒక సినిమా షూటింగులో ఉన్నాను. ఆ వార్త తెలియగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. ఆమెను అలా చూడలేక వెళ్లలేదు, నన్ను బాగా కదిలించివేసిన సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటి’ అని ఆమని బాధ పడుతూ చెప్పారు. అలాగే ఈవీవీగారు తనకు గురువు అని, ఆయన వల్లనే తాను నటిగా నిలబడగలిగాను అని, అలాంటి ఈవీవీ గారు పోయినప్పుడు కూడా తాను రాలేకపోయాను అని ఆమె చెప్పారు.

సంబంధిత సమాచారం :