అను తో అక్కినేని హీరో !
Published on Nov 25, 2017 3:04 pm IST

యుద్ధం శరణం సినిమా తరువాత నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు ఉదయం నాగ చైతన్య కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ‘మ‌హానుభావుడు’తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్యనుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కు ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదివరుకు ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. మొదటిసారి వేరే దర్శకుడు ఈ సంస్థలో పనిచెయ్యడం విశేషం. ఈ సినిమా టైటిల్ ఏంటి ? మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook