నేను చేసిన సినిమాల్లో #BRO బెస్ట్ మూవీ – నటి అవికాగోర్

Published on Dec 7, 2021 11:02 am IST

JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై నవీన్ చంద్ర, అవికా గోర్, సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదిని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్, నటీనటులు గా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో JJR రవిచంద్ నిర్మించిన చిత్రం #BRO. సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ టాక్ తో ప్రేక్షాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత చడవలవాడ శ్రీనివాసరావు గారు, టి.యఫ్.పి.సి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమక్షంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపు కున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చడవలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, “సొసైటీ కు గుర్తుండే మంచి సినిమా తీశారు. అన్న చెలెల్ల అనుబంధం గురుంచి చక్కటి మూవీ తీశారు. వీరిద్దరూ చాలా చక్కగా నటించారు. హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక రొమాంటిక్ లవ్ ఫిల్మ్ తీస్తాను. ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా ఫ్యామిలి ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకుంటుంది. స‌క్సెస్ ఫుల్ టాక్ తో సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఇంకా గొప్ప విజయం సాధించాలి” అని అన్నారు.

టి.యఫ్.పి.సి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “చదలవాడ శ్రీనివాస్ గారు బిచ్చగాడు సినిమాను మదర్, సన్ సెంటిమెంట్ తో సినిమా తీశారు. ఆ సినిమా గొప్ప విజయం సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ బ్రేక్ చేసింది. యన్.టి.ఆర్ నటించిన రక్త సంబంధం, ఆ తరువాత మాతృదేవోభవ, గోరింటాకు వంటి ఎన్నో సినిమాలు బిగ్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన #Bro కూడా అంతే బిగ్ హిట్ అయ్యింది. సోనీ లివ్ లో వస్తున్న ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు.

చిత్ర నిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ, “చాలా రోజుల తరువాత ఒక మంచి మూవీ తీశాను. నేను చేస్తున్న ఈ సినిమాకు అన్ని విధాలు సపోర్ట్ గా నిలిచిన చడవలవాడ శ్రీనివాస్ అన్న గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాను అరకు, వైజాగ్ ఏరియా లో షూట్ చేశాము. అన్నా చెల్లెళ్ళ మ‌ద్య ఒక ఢిఫ‌రెంట్ క‌థ‌నాన్ని ద‌ర్శ‌కుడు తీస‌కుని చాలా చక్కగా తీశాడు. ఇందులో నవీన్ కు చెల్లెలు గా న‌టించిన‌ అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడమే గాక అన్న‌య్యే త‌న‌కి అన్ని అని బ్ర‌తికే చెల్లెలు పాత్ర లో నటించి అంద‌ర్ని అల‌రించింది. చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి గుర్తిండిపోతుంది. అజీమ్ గారి సినిమాటోగ్రఫీ, భాస్కర పట్ల లిరిక్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇలా ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా కుదిరారు. సోని లివ్ లో స్ట్రీమ్ అవుతున్న మా #BRO సినిమాను ఇంకా పెద్ద హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు.

చిత్ర దర్శకుడు కార్తిక్ తుపురాని మాట్లాడుతూ, “కె.విశ్వనాథ్ గారు తీసిన స్వాతి ముత్యం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. మరాఠీ లో వచ్చిన హ్యాపీ బ్రదర్ సినిమాకు సచిన్ కుందాల్కర్ అందించిన క‌థ చాలా కొత్త‌గా ఎమెష‌న‌ల్ గా వుంది. ఆ కథను యధావిధిగా డబ్ చేయకుండా అందులో ఉన్న ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చుకోని రాసుకోవడం జరిగింది. నేను చెప్పిన కథ నచ్చడంతో నిర్మాత రవిచంద్ గారు ఈ మూవీ చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాకు నవీన్ చంద్ర, అవికా గోర్ నటన అలాగే శేఖర్ చంద్ర సంగీతం బ‌ల‌ప‌రిచేలా వుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ క‌ళ్ళ కి ఆహ్లాదాన్నిస్తుంది. భాస్కర పట్ల లిరిక్స్ ఇలా వీరంతా నన్ను నా కథను నమ్మి ఫుల్ సపోర్ట్ చెయ్యడంతో సినిమా చాలా చక్కగా వచ్చింది. సోనీ లివ్ లో విడుదలైన మా #Bro చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే మా చిత్రానికి బ్యాక్ బోన్ గా వుంటూ మాకు సపోర్ట్ గా నిలిచిన చడవలవాడ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇంకా మా సినిమాను చూడని వారెవరైనా వుంటే చూసి మమ్మల్ని మా టీం ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు.

లిరిసిస్ట్ భాస్కర పట్ల మాట్లాడుతూ, “శేఖర్ చంద్ర తో నాకు చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. అన్నయ్య చెల్లి కోసం, చెల్లి అన్న కోశం పాడిన పాటలు చాలా బాగా కుదిరాయి. మంచి సినిమాకు చేశాను అనే ఫీల్ కలిగింది.ఇలాంటి మంచి మూవీ కు నేను వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, “దర్శకుడు కార్తీక్ చాలా బాగా తీశాడు.ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను.కానీ సిస్టర్ గా నటించిన అవికా తో ఫస్ట్ సీన్ కే కనెక్ట్ అయ్యాను. శేఖర్ చంద్ర అందరికీ మంచి ఫీల్ వచ్చేలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర్ పట్ల గారి లిరిక్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. మంచి సినిమా చేశాము. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అందరికీ గుర్తుండి పోతాయి. ఇకముందు ఇలాంటి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు.

నటి అవికాగోర్ మాట్లాడుతూ, “ఈ క్యారెక్టర్ ను నేను ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. నవీన్ చంద్ర ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. తనతో నేను ఎంతో నేర్చుకున్నాను. దర్శకుడు చాలా చక్కటి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలలో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమా చూసిన వారందరికీ ఇందులో ఉన్న ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు.

నటుడు సాయి రోనక్ మాట్లాడుతూ, “ఈ సినిమా చూసిన వారందరూ నా క్యారెక్టర్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో నటించినందుకు నాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇలా అవకాశాలు రావడానికి కారణమైన దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు” అని అన్నారు.

నటుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ, “అన్నా చెల్లెలు కథను చాలా డీఫ్రెంట్ గా తీశారు.భాస్కర పట్ల లిరిక్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, అజీమ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి.నవీన్ చంద్ర, అవికా గోర్ లతో నటిస్తుంటే వారిని , కథను నేను ఓన్ చేసుకొని చెయ్యడం జరిగింది.ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వారి మనసుతో ఈ సినిమా మాట్లాడుతుంది” అని అన్నారు.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఈ మధ్య అన్న చెల్లెల్లు సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు.ఇలాంటి మంచి సినిమాలో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

నటి ప్రమోదీని మాట్లాడుతూ, “మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమా చూసిన వారందరికీ చెల్లికి అన్న, అన్నకు చెల్లి గుర్తుకు వస్తారు. ఇలాంటి సినిమాలో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

నవీన్ చంద్ర, అవికా గోర్,సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదీని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ తుపురాని, నిర్మాత జేజేఆర్ రవిచంద్, సంగీతం శేఖర్ చంద్ర, లిరిసిస్ట్ భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ అజీమ్ మహమ్మద్, ఎడిటర్ విప్లవ్ నైషధం లుగా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం :