నటి డింపుల్ హయాతీ కి కోవిడ్-19 పాజిటివ్

Published on Jan 17, 2022 12:00 pm IST

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ చిత్రం లో హీరోయిన్ పాత్ర చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు వెల్లడించడం జరిగింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనావైరస్ బారిన పడినట్లు డింపుల్ హయాతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తనకు కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్నాయి అని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్న హయాతి, తన అభిమానులు మరియు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాలి అని, మరియు చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలని కోరడం జరిగింది. అంతేకాకుండా, గతంలో కంటే బలంగా తిరిగి వస్తానని హామీ ఇచ్చింది.

సంబంధిత సమాచారం :