వివాహ బంధం లోకి అడుగు పెట్టిన కేజీఎఫ్ నటుడు, హరిప్రియ!

వివాహ బంధం లోకి అడుగు పెట్టిన కేజీఎఫ్ నటుడు, హరిప్రియ!

Published on Jan 27, 2023 1:04 PM IST

తకిట తకిట చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హారి ప్రియ, కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా వివాహ బంధం లోకి అడుగు పెట్టారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు, కుటుంబ సభ్యుల అంగీకారం తో పెళ్ళి చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఫోటో ను ప్రముఖ నటుడు ధనంజయ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. పెళ్లికి హాజరైన ఈ నటుడు షేర్ చేసిన ఫోటో కారణం గా అభిమానులకు ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తెలుగు లో పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా చిత్రాల్లో నటించింది హారి ప్రియ. నారప్ప చిత్రం తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన వశిష్ట సింహా కేజీఎఫ్ లో కమల్ పాత్రతో క్రేజ్ తెచ్చుకున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు