నటి కీర్తి సురేష్ కి కోవిడ్-19 పాజిటివ్

Published on Jan 11, 2022 6:29 pm IST


ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తానే స్వయం గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయి అని అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా కరోనా వైరస్ నిబంధనలు పాటించాలి అని కోరింది. ప్రస్తుతం ఇసోలేషన్ లో సేఫ్ గా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. తనను ఇటీవల కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకూ మీరు కరోనా వైరస్ వాక్సిన్ వేయించుకొనట్లైతే, దగ్గర లో ఉన్న కేంద్రాల్లో వేయించుకొని, సివియర్ లక్షణాలను అరికట్టండి అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో ఈ మహమ్మారి నుండి కోలుకొని బయట పడతాను అంటూ చెప్పుకొచ్చారు. కీర్తీ సురేష్ హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :