గోల్ మాల్ సాంగ్ కి అద్దిరిపోయే స్టెప్పులేసిన లయ!

Published on Jun 19, 2022 8:00 pm IST

అలనాటి తార లయ, నేటి తరం పాటలకు తనదైన శైలి లో స్టెప్పులు వేస్తూ, డాన్స్ వీడియో లను సోషల్ మీడియా లో షేర్ చేయడం జరుగుతుంది. తాజాగా ఈ నటి మరో వీడియో ను షేర్ చేయడం జరిగింది. 2021 లో తను ఒక హీరోయిన్ గా నటించిన హనుమాన్ జంక్షన్ చిత్రం లోని గోల్ మాల్ అనే పాటకు అద్దిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. అంతేకాక గోల్ మాల్ సాంగ్ ఫ్రం మై మూవీ అంటూ సోషల్ మీడియా లో చెప్పుకొచ్చింది.

అర్జున్, జగపతి బాబు, వేణు, లయ, స్నేహ, విజయ లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హనుమాన్ జంక్షన్ చిత్రానికి ఎం. రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ ను సాధించడం జరిగింది. లయ ఇప్పటికే పలు ట్రెండీ సాంగ్స్ కి స్టెప్పులు వేయగా, రాబోయే రోజుల్లో ఎలాంటి వీడియోలను షేర్ చేస్తుందో అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :