మహేష్ “కళావతి” కి నటి లయ అద్దిరిపోయే డాన్స్

Published on Apr 10, 2022 3:00 pm IST

మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన కళావతి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అదే పాటకి సెలబ్రిటీ లు, ఫ్యాన్స్ స్టెప్పులు వేస్తూ తమ అభిమానం చాటుతున్నారు. తాజాగా ఈ పాటకు నటి లయ డాన్స్ చేయడం జరిగింది. కళావతి సాంగ్ కి అద్దిరిపోయే స్టెప్పులు వేశారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, డాన్స్ కి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సర్కారు వారి పాట ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :