ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డుల భరతం పట్టాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడట ఈ స్టార్ హీరో.
తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రాబోతుందని తెలుస్తోంది. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ను కూడా అట్లీ ఓకే చేశాడట.
యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశాడట అట్లీ. గ్లామర్‌తో పాటు అభినయంతోనూ ఆకట్టుకునేందుకు ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాడట. ఇక అట్లీ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట.