రామ్ పోతినేని చిత్రం లో నదియా!?

Published on Jul 14, 2021 4:43 pm IST

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #RAPO19 వర్కింగ్ టైటిల్ గా షూటింగ్ షురూ అయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. వరుస సినిమాలు చేస్తూ కృతి శెట్టి టాలీవుడ్ లో దూసుకు పోతుంది.

అయితే ఈ చిత్రం ను తెలుగు మరియు తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో తాజాగా నదియా చిత్రీకరణ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో నదియా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తన లుక్ ను చిత్ర యూనిట్ రీవీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ను రెండు బాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :