“కల్కి” తన ఫేవరెట్ మూవీ అని తెలిపిన నేహ శెట్టి!

“కల్కి” తన ఫేవరెట్ మూవీ అని తెలిపిన నేహ శెట్టి!

Published on Jul 2, 2024 1:20 AM IST

రాధిక రోల్ తో తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ నేహ శెట్టి. ఈ ఏడాది టిల్లు స్క్వేర్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించారు. చివరిసారిగా విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ అంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదిక గా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

అందులో భాగంగా, తన ఫేవరెట్ మూవీ ఏంటి అని ఒకరు అడగగా, అందుకు కల్కి తన కరెంట్ ఫేవరెట్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు