తిరుపతిలో ‘లాడియా’ 8వ ల్యాబ్-గ్రోన్ డైమండ్ స్టోర్‌ను ప్రారంభించిన నటి నిధి అగర్వాల్

ల్యాబ్-గ్రోన్ డైమండ్ ఆభరణాల విక్రయ సంస్థ ‘లాడియా’ తన 8వ నూతన స్టోర్‌ను తిరుపతిలో శనివారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై, స్టోర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ అఖిల్ వేములూరు మాట్లాడుతూ.. ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగానికి భారతదేశంలో ఆదరణ వేగంగా పెరుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఆభరణాల కేంద్రంగా నిలిచే తిరుపతిలో తమ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

​అత్యాధునిక సాంకేతికతతో ప్రయోగశాలల్లో తయారుచేసే ఈ వజ్రాలు.. సహజమైన వజ్రాలతో సమానమైన ఆప్టికల్ లక్షణాలు, గ్రేడింగ్‌ కలిగి ఉంటాయని సంస్థ ప్రతినిధులు వివరించారు.

​తిరుపతి స్టోర్‌లో హారాలు, వడ్డియానాలు, నెక్లెస్‌లు, గాజులు, పెండెంట్లతో పాటు వివిధ రకాల బంగారు, సోలిటైర్ ఆభరణాలను ప్రదర్శనలో ఉంచారు. వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా డిజైన్లను రీ-కస్టమైజ్ చేసుకునే సౌలభ్యంతో పాటు ఐజీఐ (IGI) ధృవీకరణను కూడా అందిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.

​నూతన స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 1 నుండి 16 వరకు సోలిటైర్ డైమండ్స్‌పై 20 శాతం, ఇతర డైమండ్స్, తయారీ ఛార్జీలపై 15 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు పాత బంగారం మార్పిడి సౌకర్యం ఉంతుందని, ఎలాంటి వేస్టేజ్ ఛార్జీలు లేకుండా ఆభరణాలను కొనుగోలు చేయవచ్చని వివరించారు.

Exit mobile version