ప్రభాస్ క్యారెక్టర్ అదే.. పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on Mar 14, 2022 12:00 am IST

ఫేడ్ అవుట్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక రచ్చకు తెర తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెట్టే ప్రతి ట్వీట్‌ లో, ప్రతి పోస్ట్‌ లో ప్రతి మెసేజ్ లో ఎన్నో నిగూడార్థాలు ఉంటాయి. ఇక తాజాగా పూనమ్‌ ఒక ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రభాస్‌ లాంటి వ్యక్తి ఎవరూ లేరని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్, యాక్టర్స్ చాలామంది ఉంటారు. అయితే, ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం అంటే చాలా గొప్ప విషయం. అది ప్రభాస్‌ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలడు. పైగా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అన్నిటికీ మించి ప్రభాస్ లుక్స్, క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. నమ్మిన వాళ్ల కోసం నిలబడడమే ప్రభాస్ క్యారెక్టర్’ అని ప్రభాస్ పై పూనమ్‌ కౌర్ ప్రశంసలు కురిపించింది.

సంబంధిత సమాచారం :