కారు ప్రమాదానికి గురైన అలనాటి స్టార్ హీరోయిన్ రంభ!

కారు ప్రమాదానికి గురైన అలనాటి స్టార్ హీరోయిన్ రంభ!

Published on Nov 1, 2022 6:56 PM IST


సీనియర్ నటి రంభ ఈరోజు కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నటి మరియు ఆమె పిల్లలు కారులో ఉన్నారు. వివరాల్లోకి వెళితే రంభ తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తిరిగి తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నటి కారు ఒక కూడలి వద్ద మరొక కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో అందరికీ స్వల్ప గాయాలయ్యాయి.

ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడం జరిగింది. కారు నష్టాన్ని వర్ణించే కొన్ని చిత్రాలను జోడించింది. ఆమె చిన్న కుమార్తె సాషా ఇప్పటికీ ఆసుపత్రిలో ఉందని, వారు కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని రంభ కోరింది. శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు మరియు అభిమానులు నటిని చింతించవద్దని, తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలని కోరడం ప్రారంభించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు