బాలివుడ్ లో నటించేందుకు సిద్ధమైన సాయి పల్లవి!

Published on Dec 26, 2021 8:07 pm IST

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం లో సాయి పల్లవి తో పాటుగా, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. ఈ చిత్రం లో మెయిన్ సాయి పల్లవి పాత్ర కి భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమా లో సాయి నటన మరియు డాన్స్ కి గానూ ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ చిత్రం పలు బాషల్లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి ను తాజాగా బాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిందీ చిత్రాల్లో నటించడానికి సిద్ధం గా ఉన్నట్లు స్పష్టం చేసింది. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. పాత్ర బావుండాలి, బలమైన పాత్ర ఉంటే చేయడానికి సిద్ధం అన్నట్లు తెలిపారు. అయితే నెక్స్ట్ రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :