“శాకుంతలం” ను చూసిన సమంత…రెస్పాన్స్ ఇదే!

Published on Mar 14, 2023 2:00 pm IST

సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం ను ఏప్రిల్ 14, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ను స్టార్ హీరోయిన్ సమంత చూడటం జరిగింది. చూసిన ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు.

చివరికి సినిమా చూశాను, గుణ శేఖర్ గారు మీరు నా హృదయాన్ని కలిగి ఉన్నారు. చాలా అందమైన చిత్రం. మన గొప్ప ఇతిహాసాలలో ఒకటి జీవం పోసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ పవర్ ఫుల్ ఎమోషన్స్ తో సినిమాను ఆస్వాదిస్తారు, అందుకు నేను వేచి ఉండలేను అని అన్నారు. అంతేకాక పిల్లలు అందరూ కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించబోతున్నారు అని అన్నారు.

ఈ అద్భుతమైన ప్రయాణానికి దిల్ రాజు గారికి, నీలిమ గుణ కి థాంక్స్. శాకుంతలం ఎప్పటికీ నాకు దగ్గరగా ఉంటుంది అని అన్నారు. సమంత చేసిన వ్యాఖ్యలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో దేవ్ మోహన్ కీలక పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :