‘అఖిల్’ సినిమా తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సయేశా సైగల్. ఈచిత్రం తరువాత తెలుగులో మాత్రం అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. ఆ తరువాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయిపొయింది. అందులో భాగంగా కడై కుట్టి సింగం , గజినీకాంత్ , చిత్రాల్లో నటించింది. ఇక ప్రస్తుతం ఆమె , సూర్య నటిస్తున్న ‘కాప్పాన్’ లో నటిస్తుంది.
ఇక ఈ హీరోయిన్ తమిళ హీరో ఆర్య ను పెళ్లి చేసుకోనుందని గత కొన్ని రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. గజినీకాంత్ షూటింగ్ టైం లో ఆర్య , సయేశా లమధ్య మంచి అనుబందం ఏర్పడిందట. ఆ తరువాత అదే రిలేషన్ షిప్ ను కొనసాగిస్తూ బయట కనిపించారట. ఇక వీరిద్దరి పెళ్లి కి కూడా వారి కుటుంభ సభ్యులు అగీకారం తెలిపారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ ఒక్కట్టవుతారని కోలీవుడ్ టాక్.
