నటి శోభన కి కరోనా పాజిటివ్!

Published on Jan 10, 2022 12:00 pm IST

ప్రముఖ నటి, డాన్సర్ శోభనా కి తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ భారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఓమ్నివైరస్ సోకినట్లు తెలిపారు.

అయితే తను వాక్సిన్ తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. వాక్సిన్ తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను, ఎందుకంటే 85 శాతం వరకు వైరస్ అభివృద్ధి ను చేయకుండా నిరోధిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మీరు ఇప్పటికీ అలా చేయకుంటే వాక్సిన్ తీసుకోమని కోరుతున్నా అని అన్నారు. శోభన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :