బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి స్నేహా..!

Published on Nov 19, 2021 12:07 am IST


ప్రముఖ నటి, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ స్నేహా పోలీసులను ఆశ్రయించారు. చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నన్ను బెదిరిస్తున్నారంటూ కణత్తూర్‌ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అసలు విషయానికి వస్తే చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ నడుపుతున్నారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని వారు చెప్పడంతో రూ.26 లక్షలను స్నేహ అందులో పెట్టుబడి పెట్టిందట.

అయితే వాటా ఇవ్వకపోగా, కనీసం తన డబ్బుకు వడ్డీ అయినా ఇవ్వమని అడిగినా కూడా వారు ఇవ్వడం లేదని, అలాగే తాను ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని, గట్టిగా అడిగితే తనను బెదిరిస్తున్నారని స్నేహ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు.

సంబంధిత సమాచారం :