తనపై చూపుతున్న ప్రేమకు “కేజీఎఫ్ 2” హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెస్పాన్స్!

Published on Apr 19, 2022 7:37 pm IST

యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కనివిని ఎరుగని రీతిలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. చిత్రం లో ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ తన పై చూపిస్తున్న ప్రేమ కి హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఒక స్మాల్ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. తన హృదయం కృతజ్ఞత తో నిండుగా ఉంది అని అన్నారు. కారు లో కూర్చొని ఉన్న ఈ హీరోయిన్, గాల్లో కిస్సెస్ ఇచ్చారు. ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :