కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నటి !

Published on Jan 23, 2022 8:14 pm IST

సీనియర్ నటి ‘సుధ’ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు. అయితే, సుధ తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘సుధ’ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌ లో బాగానే సంపాదించాను. అలాగే బిజినెస్‌ చేసి మొత్తం పోగొట్టుకున్నాను. ఢిల్లీలో నేను ఒక హోటల్‌ పెట్టాను. లాభం వచ్చింది. అది చూసి మరో హోటల్‌ పెట్టాను. అన్నీ నష్టాలు వచ్చాయి.

అంతలో మా నాన్నగారు పోయారు. నిజానికి మా నాన్న గారికి క్యాన్సర్‌ అనగానే మా బంధువులంతా దూరం అయిపోయారు. నిజానికి నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉంటున్నారు. కానీ వాళ్లకూ ఏదో ఒక రోజు నా పరిస్థితే వస్తుంది. చాలామందికి తెలియక పోవచ్చు.. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో నిజంగా జరిగాయి’ అంటూ సుధ కన్నీళ్లు పెట్టుకుంది.

సంబంధిత సమాచారం :