‘లైగర్’ బోల్డ్ పిక్ వెనుక … అసలు కథ ఇదే …. !!

‘లైగర్’ బోల్డ్ పిక్ వెనుక … అసలు కథ ఇదే …. !!

Published on Jul 3, 2022 1:30 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనుండగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఆయనకి తల్లిపాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయి మంచి స్పందన రాబట్టింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ వారు కలిసి దీనిని నిర్మిస్తున్నారు. ప్రపంచప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీ నుండి నేడు విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్ లో ఉన్న ఒక పోస్టర్ ని విడుదల చేసింది యూనిట్. అయితే ఆ పిక్ పై ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తోంది.

కొందరు విజయ్ ఎంతో డేరింగ్ గా ఈ పిక్ దిగారు అంటుంటే, మరికొందరు దీనిపై నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ బోల్డ్ పిక్ వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. వాస్తవానికి కొన్ని ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే బాక్సర్ల బరువును కొలవడానికి వారు న్యూడ్ గా ఉండాల్సి ఉంటుంది. అయితే వారి బరువుని గ్రాముల కొలవడం కోసం న్యూడ్ గా ఉండకతప్పదని, మూవీ ఈ నేపథ్యంలో సాగుతుంది కనుక హీరో విజయ్ ని కూడా ఇలానే బరువు కొలుస్తారని, ఇది ఆ సందర్భంలో వచ్చే పిక్ అని అంటోంది యూనిట్. అయితే ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతూ ఉండడంతో పాటు ఏకంగా ఇన్స్టాగ్రామ్ లో ఎంతో స్పీడ్ గా 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న ఇండియన్ మూవీ పోస్టర్ గా రికార్డు కొట్టింది. మరి ఇప్పటినుండే రికార్డ్స్ షురూ చేసిన లైగర్ విడుదల తరువాత ఎంత మేర కలెక్షన్స్ కొల్లగొడతాడో చూడాలి. కాగా ఈ మూవీ ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు