ఓటీటీ వైపు అడుగులేస్తున్న ‘అద్భుతం’?

Published on Sep 12, 2021 2:54 am IST


బాల నటుడుగా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జ ‘జాంబీరెడ్డి’ సినిమాతో తన ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఊపుతో కనిపించిన తేజకు ఇటీవల రిలీజ్ అయిన సినిమా ‘ఇష్క్’-‘నాట్ ఎ లవ్ స్టోరీ’ నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ కూడా తేజ డిసప్పాయింట్ కాకుండా తన తదుపరి సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తేజ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘అద్భుతం’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో తేజ సరసన శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు జాంబీరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మనే కథ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత తేజ ప్రశాంత్ వర్మతో ‘హనుమాన్’ అనే సినిమాను కూడా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :