ప్రెస్ నోట్ : అద్భుతం… నిజంగా అద్భుతం !!

Published on Nov 19, 2021 8:00 am IST

అద్భుతం… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులను నవంబర్ 19న థ్రిల్ చేయబోతున్న ఒక కంప్లీట్ డిజిటల్ ట్రీట్.  నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న “అద్భుతం” లో డిజిటల్ ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అద్భుతాలు అందించబోతోంది ఈ  చిత్రం. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేయబోతోంది. ఒక మిస్టీరియస్ డ్రామా కి ప్రేమ కథని కలిపి చేసిన ఒక వినూత్న ప్రయోగంగా ఈ చిత్రం ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ఓ గమ్మత్తయిన కథ రాశారు. పాపులర్ వెబ్ సిరీస్ “పెళ్లి గోల” తోపాటు “నరుడా డోనరుడా” సినిమాని డైరెక్ట్ చేసిన మల్లిక్ తేజ ఈ సినిమాని ప్రతి క్షణం ఇంటరెస్టింగ్ గా ఉండేలా తీర్చిదిద్దారు. ఎన్నోసినిమాలకు తన సరదా మాటలతో ప్రాణం పోసిన లక్ష్మీ భూపాల ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. రధన్ మ్యూజిక్ కంపోజింగ్, విద్యాసాగర్ చింతా కెమెరా విజువలైజషన్, గ్యారీ ఎడిటింగ్ ఈ సినిమాని మరింత షార్ప్ గా తయారు చేశాయి.

ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ ప్రేక్షకుల కోసం వస్తున్నా ఈ ఫాంటసీ లవ్ స్టోరీ కోసం టైం సెట్ చేసుకోండి. గుర్తుంచుకోండి… అద్భుతం. అందరిచేతా అద్భుతం అనిపిస్తుంది.

“అద్భుతం”  స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/AdbhutamStreamingNow

Content Produced by Indian Clicks, LLC

సంబంధిత సమాచారం :