ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికీ…డిఫెరెంట్ కాన్సెప్ట్ తో “అద్భుతం” ట్రైలర్

Published on Nov 9, 2021 10:11 pm IST


తేజ సజ్జా మరియు శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం అద్భుతం. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల అయ్యింది.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికీ ఇస్తే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఫండ్ అండ్ ఎంట్టైన్మెంట్ తో పాటుగా మంచి ఫీల్ గుడ్ లవ్ ను ఈ సినిమాలో చూపించినట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. మోగుల్ల చంద్ర శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 19 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :